Logo

ఆదికాండము అధ్యాయము 49 వచనము 14

ఆదికాండము 30:18 లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.

ద్వితియోపదేశాకాండము 33:18 జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

యెహోషువ 19:17 నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.

యెహోషువ 19:18 వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను

యెహోషువ 19:19 అబెసు రెమెతు ఏన్గన్నీము

యెహోషువ 19:20 ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు

యెహోషువ 19:21 సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు

యెహోషువ 19:22 అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

యెహోషువ 19:23 వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

న్యాయాధిపతులు 5:15 ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.

న్యాయాధిపతులు 10:1 అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.

1దినవృత్తాంతములు 12:32 ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.

ఆదికాండము 46:13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.

సంఖ్యాకాండము 1:28 ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

యోబు 39:5 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?

2దెస్సలోనీకయులకు 3:12 అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.

1తిమోతి 2:2 రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.