Logo

ఆదికాండము అధ్యాయము 49 వచనము 31

ఆదికాండము 23:3 తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి

ఆదికాండము 23:16 అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగువందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.

ఆదికాండము 23:17 ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నియు,

ఆదికాండము 23:18 అతని ఊరి గవిని ప్రవేశించువారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

ఆదికాండము 23:19 ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.

ఆదికాండము 23:20 ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

ఆదికాండము 25:9 హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.

ఆదికాండము 35:29 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.

ఆదికాండము 47:30 నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.

ఆదికాండము 50:13 అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశా నముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తీయుడైన ఎఫ్రోను యెద్ద కొనెను

అపోస్తలులకార్యములు 7:16 షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి.

ఆదికాండము 15:15 నీవు క్షేమముగా నీ పితరులయొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.

ఆదికాండము 23:20 ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

ఆదికాండము 25:10 అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి.

ఆదికాండము 29:16 లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.