Logo

జెకర్యా అధ్యాయము 9 వచనము 6

యెషయా 14:29 ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.

యెషయా 14:30 అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును.

యెషయా 14:31 గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.

యిర్మియా 47:1 ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

యిర్మియా 47:4 ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,

యిర్మియా 47:5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?

యిర్మియా 47:6 యెహోవా ఖడ్గమా, యెంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము.

యిర్మియా 47:7 అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

యెహెజ్కేలు 25:15 మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక

యెహెజ్కేలు 25:16 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.

యెహెజ్కేలు 25:17 క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారిమీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

జెఫన్యా 2:4 గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.

జెఫన్యా 2:5 సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్నుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.

జెఫన్యా 2:6 సముద్రప్రాంతము గొఱ్ఱల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

జెఫన్యా 2:7 తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.

అపోస్తలులకార్యములు 8:26 ప్రభువు దూత నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.

యిర్మియా 51:8 బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియలాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొనిరండి.

యిర్మియా 51:9 మనము బబులోనును స్వస్థపరచగోరితివిు అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచిపెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది

యెహెజ్కేలు 26:15 తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.

యెహెజ్కేలు 26:16 సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.

యెహెజ్కేలు 26:17 వారు నిన్నుగూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగున అందురు సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.

యెహెజ్కేలు 26:18 ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలుచున్నవి.

యెహెజ్కేలు 26:19 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగిపోవువారితో కూడ నిన్ను నివసింపజేసెదను.

యెహెజ్కేలు 26:20 మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;

యెహెజ్కేలు 26:21 నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడకయుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

ప్రకటన 18:9 దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు

ప్రకటన 18:10 దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహా పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెనుగదా అని చెప్పుకొందురు.

ప్రకటన 18:11 లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదా రంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరకులను,

ప్రకటన 18:12 ప్రతి విధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను,

ప్రకటన 18:13 దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోదుమలు పశువులు గొఱ్ఱలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;

ప్రకటన 18:14 నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.

ప్రకటన 18:15 ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు

ప్రకటన 18:16 అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహా పట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడై పోయెనే అని చెప్పుకొనుచు దాని భాదను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు

ప్రకటన 18:17 ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహనధూమమును చూచి

యెషయా 20:5 వారు తాము నమ్ముకొనిన కూషీయులనుగూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులనుగూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.

యెషయా 20:6 ఆ దినమున సముద్రతీర నివాసులు అష్షూరు రాజుచేతిలోనుండి విడిపింపబడవలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.

రోమీయులకు 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

ఫిలిప్పీయులకు 1:20 నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును.

ద్వితియోపదేశాకాండము 2:23 గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.

యెహోషువ 10:41 కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.

యెహోషువ 15:45 ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,

1సమూయేలు 6:17 అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.

నెహెమ్యా 4:7 సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మో నీయులును అష్డోదీయులును, యెరూషలేము యొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు

యెషయా 11:14 వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు

యెషయా 14:30 అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును.

యిర్మియా 25:20 సమస్తమైన మిశ్రిత జనులును ఊజు దేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును

యిర్మియా 47:5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?

ఆమోసు 1:6 యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలెనని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.

ఆమోసు 1:7 గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

ఓబధ్యా 1:19 దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు.