Logo

మార్కు అధ్యాయము 3 వచనము 32

మత్తయి 12:46 ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి.

మత్తయి 12:47 అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.

మత్తయి 12:48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవాని చూచి నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? అని చెప్పి

లూకా 8:19 ఆయన తల్లియు సహోదరులును ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి.

లూకా 8:20 అప్పుడు నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.

లూకా 8:21 అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.

2దినవృత్తాంతములు 15:16 మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.

మార్కు 3:21 ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

యోహాను 7:3 ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.

అపోస్తలులకార్యములు 1:14 వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

2కొరిందీయులకు 5:16 కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.