Logo

మార్కు అధ్యాయము 9 వచనము 32

మార్కు 9:12 అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?

మార్కు 8:31 మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.

మత్తయి 16:21 అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

మత్తయి 20:18 ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి

మత్తయి 20:19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.

మత్తయి 20:28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

మత్తయి 21:38 అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని

మత్తయి 21:39 అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

మత్తయి 26:2 రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.

లూకా 9:44 ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

లూకా 18:31 ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారునిగూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును.

లూకా 18:32 ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి,

లూకా 18:33 ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.

లూకా 24:26 క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

లూకా 24:44 అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

లూకా 24:45 అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

లూకా 24:46 క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

యోహాను 2:19 యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.

యోహాను 3:14 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో,

యోహాను 10:18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

అపోస్తలులకార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.

అపోస్తలులకార్యములు 2:24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను.

అపోస్తలులకార్యములు 4:27 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

అపోస్తలులకార్యములు 4:28 వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతిపిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

2తిమోతి 2:12 సహించినవారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.

మత్తయి 17:22 వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు,

మార్కు 9:9 వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకుముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

మార్కు 10:33 ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు.

మార్కు 14:41 ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

లూకా 9:22 మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను.

లూకా 17:25 అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను.

లూకా 24:6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు

యోహాను 20:9 ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.

1కొరిందీయులకు 15:4 లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.