Logo

మార్కు అధ్యాయము 10 వచనము 48

మత్తయి 2:23 ఏలుచున్నా డని విని, అక్కడికి వెళ్లవెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)

మత్తయి 21:11 జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

మత్తయి 26:71 అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరియొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా

లూకా 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

లూకా 18:36 జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా

లూకా 18:37 వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.

యోహాను 1:46 అందుకు నతనయేలు నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.

యోహాను 7:41 మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరు ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా?

యోహాను 7:52 వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.

యోహాను 19:19 మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.

అపోస్తలులకార్యములు 6:14 ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.

యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యెషయా 9:7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

యిర్మియా 23:5 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

యిర్మియా 23:6 అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

మత్తయి 1:1 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.

మత్తయి 9:27 యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి.

మత్తయి 12:23 అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి.

మత్తయి 15:22 ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

మత్తయి 20:30 ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని విని ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.

మత్తయి 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

మత్తయి 22:42 క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.

మత్తయి 22:43 అందుకాయన ఆలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు

మత్తయి 22:44 నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు?

మత్తయి 22:45 దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా

అపోస్తలులకార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

అపోస్తలులకార్యములు 13:23 అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.

రోమీయులకు 1:3 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగుగాక,

రోమీయులకు 1:4 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానము చేసెను.

ప్రకటన 22:16 సంఘముల కోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.

మత్తయి 15:23 అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మనవెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా

మార్కు 14:67 పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.

లూకా 18:5 ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.

లూకా 18:35 ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను.

యోహాను 4:47 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను.