Logo

మార్కు అధ్యాయము 14 వచనము 3

సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.

విలాపవాక్యములు 3:27 యౌవన కాలమున కాడిమోయుట నరునికి మేలు.

మత్తయి 26:5 అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.

మార్కు 11:18 శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.

మార్కు 11:32 మనుష్యులవలన కలిగినదని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్తయని యెంచిరి

లూకా 20:6 మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని

యోహాను 7:40 జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;

యోహాను 12:19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

మత్తయి 14:5 అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.

మత్తయి 26:2 రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.

లూకా 22:1 పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను.

లూకా 22:6 వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.

యోహాను 13:1 తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.

అపోస్తలులకార్యములు 4:27 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

అపోస్తలులకార్యములు 21:31 వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;