Logo

మార్కు అధ్యాయము 16 వచనము 1

మార్కు 15:40 వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.

మార్కు 16:1 విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.

మత్తయి 27:61 మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి.

మత్తయి 28:1 విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.

లూకా 23:55 అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి

లూకా 23:56 తిరిగివెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.

లూకా 24:1 ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధియొద్దకు వచ్చి

లూకా 24:2 సమాధిముందర ఉండిన రాయి దొరలింపబడి యుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని

లేవీయకాండము 2:6 అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను.

మత్తయి 13:55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా యనువారు ఇతని సోదరులు కారా?

మత్తయి 27:56 వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరి యయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.

మార్కు 16:3 సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.

మార్కు 16:9 ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను.

లూకా 23:49 ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.

యోహాను 11:34 వారు ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.