Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 13 వచనము 12

నిర్గమకాండము 9:3 ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.

1సమూయేలు 5:6 యెహోవా హస్తము అష్డోదు వారిమీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులలో నున్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా

1సమూయేలు 5:9 అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.

1సమూయేలు 5:11 కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను.

యోబు 19:21 దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.

కీర్తనలు 32:4 దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)

కీర్తనలు 38:2 నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.

కీర్తనలు 39:10 నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీచేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.

కీర్తనలు 39:11 దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మటకొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)

అపోస్తలులకార్యములు 9:8 సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.

అపోస్తలులకార్యములు 9:9 అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను.

అపోస్తలులకార్యములు 9:17 అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతనిమీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను

ఆదికాండము 19:11 అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

2రాజులు 6:8 సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను.

యెషయా 29:10 యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకువేసియున్నాడు.

యోహాను 9:39 అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

రోమీయులకు 11:7 ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి.

రోమీయులకు 11:8 ఇందువిషయమై నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

రోమీయులకు 11:9 మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.

రోమీయులకు 11:10 వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.

రోమీయులకు 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

2పేతురు 2:17 వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

1రాజులు 22:28 అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించుడని చెప్పెను రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.

2రాజులు 6:18 ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.

2దినవృత్తాంతములు 18:27 అప్పుడు మీకాయా యిట్లనెను నీవు సురక్షితముగా తిరిగివచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్త జనులారా ఆలకించుడనెను.

యోబు 12:25 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

యోబు 38:15 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.

యెషయా 51:18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయి పట్టుకొనువాడెవడును లేకపోయెను.

యెహెజ్కేలు 11:13 నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి అయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని.

లూకా 11:34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.

అపోస్తలులకార్యములు 5:5 అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను;

అపోస్తలులకార్యములు 22:11 ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.

2కొరిందీయులకు 10:6 మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడియున్నాము.

2తిమోతి 3:9 అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.

హెబ్రీయులకు 8:9 అది నేను ఐగుప్తు దేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు