Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 13 వచనము 32

అపోస్తలులకార్యములు 1:3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారికగపడుచు, దేవుని రాజ్య విషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

అపోస్తలులకార్యములు 1:11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగివచ్చునని వారితో చెప్పిరి

అపోస్తలులకార్యములు 10:41 ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.

మత్తయి 28:16 పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.

మార్కు 16:12 ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను.

మార్కు 16:13 వారు వెళ్లి తక్కినవారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి.

మార్కు 16:14 పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.

లూకా 24:36 వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి--మీకు సమాధానమవుగాకని వారితో అనెను.

లూకా 24:37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

లూకా 24:38 అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

లూకా 24:39 నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి

లూకా 24:40 తన చేతులను పాదములను వారికి చూపెను.

లూకా 24:41 అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.

లూకా 24:42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి.

యోహాను 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

యోహాను 20:20 ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.

యోహాను 20:21 అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.

యోహాను 20:22 ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి.

యోహాను 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

యోహాను 20:24 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను

యోహాను 20:25 గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

యోహాను 20:26 ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను.

యోహాను 20:27 తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నాచేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

యోహాను 20:28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.

యోహాను 20:29 యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

యోహాను 21:1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా

యోహాను 21:2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.

యోహాను 21:3 సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.

యోహాను 21:4 సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.

యోహాను 21:5 యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,

యోహాను 21:6 లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయన దోనె కుడిప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.

యోహాను 21:7 కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.

యోహాను 21:8 దరి యించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.

యోహాను 21:9 వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.

యోహాను 21:10 యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొనిరండని వారితో చెప్పగా

యోహాను 21:11 సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;

యోహాను 21:12 చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.

యోహాను 21:13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.

యోహాను 21:14 యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.

1కొరిందీయులకు 15:5 ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

1కొరిందీయులకు 15:6 అటుపిమ్మట ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

1కొరిందీయులకు 15:7 తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

అపోస్తలులకార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను

అపోస్తలులకార్యములు 1:22 ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియైయుండుట ఆవశ్యకమని చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.

అపోస్తలులకార్యములు 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

అపోస్తలులకార్యములు 5:32 మేమును, దేవుడు తనకు విధేయులైనవారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 10:39 ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.

లూకా 24:48 ఈ సంగతులకు మీరే సాక్షులు

యోహాను 15:27 మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.

హెబ్రీయులకు 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,

హెబ్రీయులకు 2:4 దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.

మార్కు 16:7 మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను.

అపోస్తలులకార్యములు 10:40 దేవుడాయనను మూడవ దినమున లేపి

అపోస్తలులకార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

అపోస్తలులకార్యములు 26:8 దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?

ప్రకటన 11:3 నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.