Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 13 వచనము 27

అపోస్తలులకార్యములు 13:15 ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.

అపోస్తలులకార్యములు 13:17 ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి

అపోస్తలులకార్యములు 13:46 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము

అపోస్తలులకార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

2దినవృత్తాంతములు 20:7 నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవు నీవే.

కీర్తనలు 105:6 ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి

కీర్తనలు 147:19 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.

కీర్తనలు 147:20 ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

యెషయా 41:8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

యెషయా 48:1 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.

యెషయా 51:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండువారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి

యెషయా 51:2 మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.

మత్తయి 3:9 దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

మత్తయి 10:6 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱలయొద్దకే వెళ్లుడి.

లూకా 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

అపోస్తలులకార్యములు 13:16 అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను

అపోస్తలులకార్యములు 13:43 సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.

అపోస్తలులకార్యములు 10:35 ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

అపోస్తలులకార్యములు 16:17 ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.

అపోస్తలులకార్యములు 28:28 కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడియున్నదని మీరు తెలిసికొందురు గాక,

యెషయా 46:13 నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.

లూకా 1:69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను

లూకా 1:77 మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన

రోమీయులకు 1:16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.

2కొరిందీయులకు 5:19 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.

2కొరిందీయులకు 5:20 కావున దేవుడు మాద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.

2కొరిందీయులకు 5:21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.

ఎఫెసీయులకు 1:13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

కొలొస్సయులకు 1:5 మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

ద్వితియోపదేశాకాండము 30:14 నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది.

2రాజులు 4:1 అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా

2దినవృత్తాంతములు 28:8 ఇదియు గాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెరతీసికొనిపోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.

కీర్తనలు 25:12 యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.

కీర్తనలు 50:23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

కీర్తనలు 67:7 దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

కీర్తనలు 96:2 యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.

కీర్తనలు 103:13 తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారియెడల జాలిపడును.

కీర్తనలు 115:13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును.

మలాకీ 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

లూకా 10:11 మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి.

లూకా 12:57 ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?

లూకా 13:16 ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.

లూకా 14:17 విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.

యోహాను 1:11 ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

యోహాను 8:37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.

అపోస్తలులకార్యములు 1:16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.

అపోస్తలులకార్యములు 3:12 పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంత శక్తిచేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?

అపోస్తలులకార్యములు 3:25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.

అపోస్తలులకార్యములు 10:2 అతడు తన యింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మముచేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.

అపోస్తలులకార్యములు 17:3 నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయి యున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములు తర్కించుచుండెను.

అపోస్తలులకార్యములు 22:1 సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.

రోమీయులకు 2:9 దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ, శ్రమయు వేదనయు కలుగును.

రోమీయులకు 4:1 కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.

రోమీయులకు 9:3 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును.

రోమీయులకు 10:15 ప్రకటించువారు పంపబడనియెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందువిషయమై ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది

ఫిలిప్పీయులకు 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమునుచేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయ కారణము కలదు

యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.