Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 13 వచనము 14

అపోస్తలులకార్యములు 13:6 వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌ యేసు అను ఒక యూదుని చూచిరి.

అపోస్తలులకార్యములు 27:13 మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.

అపోస్తలులకార్యములు 2:10 కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

అపోస్తలులకార్యములు 14:24 తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 14:25 మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.

అపోస్తలులకార్యములు 27:5 మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితివిు.

అపోస్తలులకార్యములు 13:5 వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.

అపోస్తలులకార్యములు 15:38 అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.

కొలొస్సయులకు 4:10 నాతో కూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.

2తిమోతి 4:11 లూకా మాత్రమే నాయొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.

దానియేలు 11:35 నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.

అపోస్తలులకార్యములు 9:18 అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.

అపోస్తలులకార్యములు 12:12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థన చేయుచుండిరి.

అపోస్తలులకార్యములు 12:25 బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.

అపోస్తలులకార్యములు 15:36 కొన్ని దినములైన తరువాత ఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.

అపోస్తలులకార్యములు 15:37 అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొనిపోవుటకు బర్నబా యిష్టపడెను.

ఫిలిప్పీయులకు 2:21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

2తిమోతి 4:10 దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

ఫిలేమోనుకు 1:24 నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.