Logo

1కొరిందీయులకు అధ్యాయము 11 వచనము 7

సంఖ్యాకాండము 5:18 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తలముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 22:5 స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.

ఆదికాండము 24:65 మనలనెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.

ద్వితియోపదేశాకాండము 21:12 నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని

1కొరిందీయులకు 14:35 వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తలనడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.