Logo

1కొరిందీయులకు అధ్యాయము 11 వచనము 15

2సమూయేలు 14:26 తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.

1కొరిందీయులకు 14:35 వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తలనడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.

యెహెజ్కేలు 44:20 మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తలవెండ్రుకలు పెరుగనియ్యక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను.

లూకా 12:57 ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?

రోమీయులకు 2:14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.

1కొరిందీయులకు 6:5 మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?

1కొరిందీయులకు 11:4 ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.

ప్రకటన 9:8 స్త్రీల తల వెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.