Logo

1కొరిందీయులకు అధ్యాయము 11 వచనము 10

ఆదికాండము 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.

ఆదికాండము 2:20 అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను.

ఆదికాండము 2:23 అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.

ఆదికాండము 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

సంఖ్యాకాండము 30:13 ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దుచేయవచ్చును.

1దెస్సలోనీకయులకు 2:6 మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరులవలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

1తిమోతి 2:13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?