సంఖ్యాకాండము 9:20 మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటి మాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాటచొప్పుననే ప్రయాణము చేసిరి.
సంఖ్యాకాండము 10:13 యెహోవా మోషేచేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.
నిర్గమకాండము 17:1 తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున
2యోహాను 1:6 మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
1కొరిందీయులకు 10:1 సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;
సంఖ్యాకాండము 9:16 నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.