Logo

సంఖ్యాకాండము అధ్యాయము 12 వచనము 16

సంఖ్యాకాండము 11:35 జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి.

సంఖ్యాకాండము 33:18 హజేరోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 2:23 గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.

సంఖ్యాకాండము 10:12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.

సంఖ్యాకాండము 13:3 మోషే యెహోవా మాటవిని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.

సంఖ్యాకాండము 13:26 అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజము నొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.

ఆదికాండము 21:21 అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

1సమూయేలు 25:1 సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.

హబక్కూకు 3:3 దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయుచున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.

ఆదికాండము 14:6 ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత

ద్వితియోపదేశాకాండము 1:1 యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.