Logo

సంఖ్యాకాండము అధ్యాయము 15 వచనము 18

సంఖ్యాకాండము 15:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత

ద్వితియోపదేశాకాండము 26:1 నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు

ద్వితియోపదేశాకాండము 26:2 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి

ద్వితియోపదేశాకాండము 26:3 ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.

ద్వితియోపదేశాకాండము 26:4 యాజకుడు ఆ గంపను నీచేతిలోనుండి తీసికొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా

ద్వితియోపదేశాకాండము 26:5 నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.

ద్వితియోపదేశాకాండము 26:6 ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠినదాస్యము మోపగా

ద్వితియోపదేశాకాండము 26:7 మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.

ద్వితియోపదేశాకాండము 26:8 అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతివలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి

ద్వితియోపదేశాకాండము 26:9 యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.

ద్వితియోపదేశాకాండము 26:10 కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమియొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి

ద్వితియోపదేశాకాండము 26:11 నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను.

ద్వితియోపదేశాకాండము 26:12 పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందిన తరువాత

ద్వితియోపదేశాకాండము 26:13 నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.

ద్వితియోపదేశాకాండము 26:14 నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనైయుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను.

ద్వితియోపదేశాకాండము 26:15 నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.

లేవీయకాండము 23:10 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకునియొద్దకు తేవలెను.