Logo

సంఖ్యాకాండము అధ్యాయము 20 వచనము 26

నిర్గమకాండము 29:29 మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.

నిర్గమకాండము 29:30 అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.

యెషయా 22:21 అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును.

యెషయా 22:22 నేను దావీదు ఇంటితాళపు అధికార భారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు

హెబ్రీయులకు 7:11 ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణసిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?

హెబ్రీయులకు 7:23 మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని

హెబ్రీయులకు 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను.

నిర్గమకాండము 28:2 అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.

లేవీయకాండము 16:32 ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.

సంఖ్యాకాండము 20:28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.

యెహోషువ 24:33 మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

1దినవృత్తాంతములు 6:50 అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,