Logo

సంఖ్యాకాండము అధ్యాయము 22 వచనము 37

సంఖ్యాకాండము 22:16 వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.

సంఖ్యాకాండము 22:17 నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.

సంఖ్యాకాండము 24:11 నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనతపొందకుండ ఆటంకపరచెననెను.

కీర్తనలు 75:6 తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చు కలుగదు.

మత్తయి 4:8 మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి

మత్తయి 4:9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా

లూకా 4:6 ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడి యున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

యోహాను 5:44 అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;

సంఖ్యాకాండము 22:14 మోయాబు అధికారులు లేచి బాలాకునొద్దకు వెళ్లి బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి.

దానియేలు 2:6 కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహా ఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు