లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 17: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 17:28

అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱమందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను.

ఎఫెసీయులకు 6:1

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే.

ఎఫెసీయులకు 6:2

నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,

1సమూయేలు 26:5

తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.

లూకా 19:43

(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

నిర్గమకాండము 32:17

ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

యెహోషువ 6:5

మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జను లందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.

యిర్మియా 50:14

ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి

యెహెజ్కేలు 21:22

యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.