లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 17: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 10:16

రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.

2దినవృత్తాంతములు 9:15

రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.

యెహోషువ 8:18

అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనునీవుచేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీచేతి కప్పగింతును, అంతట యెహోషువ తనచేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.