లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 20: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాని వెనుకనుండి కేకవేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసికొనివచ్చెను గాని"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 55:6

ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

కీర్తనలు 55:7

త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

కీర్తనలు 55:8

అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని.

కీర్తనలు 55:9

పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

సామెతలు 6:4

ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.

సామెతలు 6:5

వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.

మత్తయి 24:16

యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను

మత్తయి 24:17

మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకు దిగకూడదు;

మత్తయి 24:18

పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొనిపోవుటకు ఇంటికి రాకూడదు.

మార్కు 13:14

మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;

మార్కు 13:15

మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు;

మార్కు 13:16

పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు.

లూకా 17:31

ఆ దినమున మిద్దెమీద ఉండువాడు ఇంటఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.

లూకా 17:32

లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.

1సమూయేలు 9:27

ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచియుండుమనెను; అంతట వాడు వెళ్లెను.

1సమూయేలు 20:9

యోనాతాను ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా

1సమూయేలు 23:26

అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి.

2సమూయేలు 17:16

మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను.

కీర్తనలు 11:1

యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?