2దినవృత్తాంతములు 28: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా మనమీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపుజేయుటకు మీరు పూనుకొనియున్నారు; మన అపరాధము అధికమైయున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు.
పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజ ములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దానినుండి పవిత్రపరచుకొనకయున్నాము.
మీరు ఈ దిన మున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగ బడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతె ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమా జముమీద కోపపడును గదా?
మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
వారు గిలాదుదేశములోనున్న రూబేనీయులయొద్దకును గాదీయులయొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారియొద్ద కును పోయి వారితో ఇట్లనిరి
యెహోవా సెలవిచ్చునదేమనగా జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.
జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు, చేసిన యీ యపరాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.
మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి.
అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.
అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోత పోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.