లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 28: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్య యంతటినిగూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 20:34

యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది.

2దినవృత్తాంతములు 27:7

యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటినిగూర్చియు, అతని చర్యనుగూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 27:8

అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.

2దినవృత్తాంతములు 27:9

యోతాము తన పితరులతో కూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.

2రాజులు 16:19

ఆహాజు చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2రాజులు 16:20

ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.