నిర్గమకాండము 30: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను
అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను.
అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠముమీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను.
మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్రముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.
తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.
పోతపోసిన సముద్రపు తొట్టి యొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పది మూరలు,
మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడి తట్టుకు అయిదును ఎడమ తట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.
మట్లు, మట్లమీదనుండు తొట్లు,
సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,
ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును.
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును
ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి.
మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి
దహనబలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట
తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.