నిర్గమకాండము 30: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాని నుంచవలెను. అది మీకు అతిపరిశుద్ధముగా ఉండవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
సాక్ష్యపుమందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.
అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీదనుండియు, శాసనములుగల మందసము మీదనుండు రెండు కెరూబుల మధ్యనుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను
ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.
అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును.
నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసముమీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.
వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలెను.
మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను.