నిర్గమకాండము 30: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము. "
సంబంధిత రిఫరెన్స్‌లు
తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను
వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యముమీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.
యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.
బుక్కావాని తైలములో చచ్చిన యీగలు పడుటచేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.