నిర్గమకాండము 30: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేక తైలమై యుండవలెను;"
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు పరిశుద్ధమైన అభిషేకతైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.
మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను.
ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;
నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.