యెహెజ్కేలు 40: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
కావలి గదులకును గుమ్మములకు లోపలవాటికి మధ్యగా చుట్టునున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడియుండెను.
వాటి కిటికీలును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.
మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు
నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.
మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదు మూరలు కనబడెను.
దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువదియైదు మూరలు.
మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.
చుట్టు మధ్యగోడల నిడివి ఇరువదియైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.
మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను