లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 40: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువదియైదు మూరలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 40:28

అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.

యెహెజ్కేలు 40:29

మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు

యెహెజ్కేలు 40:30

చుట్టు మధ్యగోడల నిడివి ఇరువదియైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.

యెహెజ్కేలు 40:31

దాని మధ్యగోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

యెహెజ్కేలు 40:35

ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలతయాయెను.

నిర్గమకాండము 27:9

మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

2రాజులు 21:5

మరియు యెహోవా మందిరమునకున్న రెండు సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను.

యెహెజ్కేలు 40:27

లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.