లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 40: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 40:21

దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదు మూరలు కనబడెను.

యెహెజ్కేలు 40:25

మరియు వాటికున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.

యెహెజ్కేలు 40:36

దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.

1రాజులు 7:4

మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.

యెహెజ్కేలు 40:24

అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొనిపోగా దక్షిణపుతట్టున గుమ్మమొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.

యెహెజ్కేలు 40:30

చుట్టు మధ్యగోడల నిడివి ఇరువదియైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.