లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 10: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 2:16

మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును.

సామెతలు 5:3

జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

సామెతలు 5:20

నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పర స్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

ఎజ్రా 7:1

ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్త యొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడై యుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు

ఎజ్రా 10:12

అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.

నెహెమ్యా 13:23

ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.