ఆదికాండము 24: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవనుచేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.
తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి.
సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
మా శ్మశానభూములలో అతి శ్రేష్టమైనదానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.
వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి యున్నాడా అని అడిగిరి.
ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి నాకొక రొట్టెముక్కను నీచేతిలో తీసికొనిరమ్మని చెప్పెను.
ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.