ఆదికాండము 24: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" రిబ్కాకు లాబానను నొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలుపటనున్న ఆ మనుష్యునియొద్దకు పరుగెత్తికొనిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆమె సహోదరుడును ఆమె తల్లియుఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి.
వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేలవేలకు తల్లివగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి
లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దుపెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.