లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 24: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఆ ముక్కుకమ్మిని తన సహోదరిచేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యునియొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 24:22

ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమెచేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి

న్యాయాధిపతులు 17:2

అతడు తన తల్లిని చూచినీయొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నాయొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లినా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.

యెషయా 3:19

కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకులను

యిర్మియా 2:32

కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.