ఆదికాండము 24: 48
క్రాస్-రిఫరెన్స్‌లు
" నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి
అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను
అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.
అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను
ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడైయున్నాడు మరణమువరకు ఆయన మనలను నడిపించును.
వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను.
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటివారికి తెలిపెను.
గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును విని నప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లిలెండి, యెహోవా మిద్యానీయుల దండును మీచేతికి అప్ప గించుచున్నాడని చెప్పి
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకుదినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.
యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయులచేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి
ఈలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.