లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 30: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడామె గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 29:31

లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

1సమూయేలు 1:5

హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.

1సమూయేలు 1:6

యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువును బట్టి, ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.

యెషయా 4:1

ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.

లూకా 1:21

ప్రజలు జెకర్యా కొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

లూకా 1:25

నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను.

లూకా 1:27

దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.

కీర్తనలు 113:9

ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

జెఫన్యా 3:15

తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

యోహాను 16:21

స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.