యోబు 40: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.
వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియైయుండును ఉదయమున యథార్థవంతులు వారినేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగియుండుము.
అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
నగరువనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.
చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)
నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రిందిచోట్లకు దిగిపోవుదురు