యోబు 41: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగుచున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును."
సంబంధిత రిఫరెన్స్‌లు
రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేను మసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.
అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.
ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను.
మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును తైలమువలె చేయును.