యోబు 41: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనినయెడల నీవు మరల ఆలాగున చేయకుందువు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.
వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని
మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?
శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.