లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 22: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 22:14

మోయాబు అధికారులు లేచి బాలాకునొద్దకు వెళ్లి బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి.

ద్వితియోపదేశాకాండము 23:5

అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.

సంఖ్యాకాండము 24:1

ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.

1రాజులు 13:16

అతడు నేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను

1రాజులు 21:4

నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.