లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 22: 41

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 21:19

వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును

సంఖ్యాకాండము 21:20

మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.

సంఖ్యాకాండము 25:2

ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.

సంఖ్యాకాండము 25:3

అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

ద్వితియోపదేశాకాండము 12:2

మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.

2దినవృత్తాంతములు 11:15

యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.

యిర్మియా 48:35

ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.

సంఖ్యాకాండము 23:13

అప్పుడు బాలాకు దయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి

సంఖ్యాకాండము 32:38

షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.

యెహోషువ 13:17

హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను

యెషయా 16:12

మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియు దొరకకపోవును.

యిర్మియా 19:5

నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.

మీకా 6:5

నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగినవాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.