Logo

2రాజులు అధ్యాయము 7 వచనము 5

1సమూయేలు 30:17 దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందల మంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

యెహెజ్కేలు 12:6 వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజముమీద పెట్టుకొని నేల కనబడకుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని.

యెహెజ్కేలు 12:7 ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నాచేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని

యెహెజ్కేలు 12:12 మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామగ్రిని భుజముమీద పెట్టుకొని తానే మోసికొనిపోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చుకొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడకుండ ముఖము కప్పుకొనిపోవును

లేవీయకాండము 27:8 ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైనయెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమిచొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

లేవీయకాండము 27:26 అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.

ద్వితియోపదేశాకాండము 28:7 నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరివచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.

ద్వితియోపదేశాకాండము 32:25 బయట ఖడ్గమును లోపట భయమును యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలు గలవారిని నశింపజేయును.

ద్వితియోపదేశాకాండము 32:30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?