Logo

2రాజులు అధ్యాయము 15 వచనము 8

2రాజులు 15:1 ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా యేలనారంభించెను.

2రాజులు 14:16 అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 14:17 యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.

2రాజులు 14:21 అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి.

2రాజులు 14:29 యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 10:30 కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన యంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనముమీద ఆసీనులగుదురు.

2రాజులు 15:27 యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సరములు ఏలెను.

సామెతలు 28:2 దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిరపరచబడును.

ఆమోసు 7:9 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గముచేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.