Logo

2రాజులు అధ్యాయము 19 వచనము 36

2రాజులు 19:7 అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.

2రాజులు 19:28 నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

2రాజులు 19:33 ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును; ఇదే యెహోవా వాక్కు.

ఆదికాండము 10:11 ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

ఆదికాండము 10:12 నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.

యోనా 1:2 నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

యోనా 3:2 నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.

యోనా 3:3 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము.

యోనా 3:4 యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా

యోనా 3:5 నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసదినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.

యోనా 3:6 ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

యోనా 3:7 మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా

యోనా 3:8 ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,

యోనా 3:9 మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.

యోనా 3:10 ఈ నీనెవెవారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడు చేయక మానెను.

నహూము 1:1 నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

నహూము 2:8 కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవుచున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగిచూచు వాడొకడును లేడు.

మత్తయి 12:41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

1రాజులు 20:20 ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొనిపోయెను.

2రాజులు 17:3 అతనిమీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.

2దినవృత్తాంతములు 32:21 యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.

యెషయా 37:38 అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.