Logo

2రాజులు అధ్యాయము 25 వచనము 7

ఆదికాండము 21:16 యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.

ఆదికాండము 44:34 ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 28:34 నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.

యిర్మియా 22:30 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.

యిర్మియా 39:6 బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరిని చంపించెను.

యిర్మియా 39:7 అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.

యిర్మియా 52:10 బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి

యిర్మియా 52:11 రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతని పెట్టించెను.

యిర్మియా 32:4 అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;

యిర్మియా 32:5 మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.

యిర్మియా 34:3 నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.

యెహెజ్కేలు 12:13 అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును

యెహెజ్కేలు 12:14 మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండువారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను

యెహెజ్కేలు 12:15 నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆ యా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు

యెహెజ్కేలు 12:16 అయితే నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.

న్యాయాధిపతులు 16:21 అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.

2దినవృత్తాంతములు 33:11 కాబట్టి యెహోవా అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతులను వారిమీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొనిపోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.

2దినవృత్తాంతములు 36:6 అతనిమీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై గొలుసులతో బంధించెను.

కీర్తనలు 107:10 దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున

కీర్తనలు 107:11 బాధచేతను ఇనుప కట్లచేతను బంధింపబడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును

కీర్తనలు 149:8 గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును

యెహెజ్కేలు 7:27 రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషములనుబట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.

యెహెజ్కేలు 17:16 ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 17:17 యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.

యెహెజ్కేలు 17:18 తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.

యెహెజ్కేలు 17:19 ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపుదును,

యెహెజ్కేలు 17:20 అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.

ద్వితియోపదేశాకాండము 28:36 యెహోవా నిన్నును నీవు నీమీద నియమించుకొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమునకప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు

1సమూయేలు 31:2 సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.

2రాజులు 17:4 అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.

1దినవృత్తాంతములు 10:2 ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.

నెహెమ్యా 9:32 చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.

ప్రసంగి 4:14 అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.

ప్రసంగి 8:9 సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.

యెషయా 39:7 మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

యిర్మియా 20:4 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.

యిర్మియా 38:23 నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారిచేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.

విలాపవాక్యములు 2:9 పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడుచేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు.

యెహెజ్కేలు 19:12 అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయబడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.

హబక్కూకు 1:10 రాజులను అపహాస్యముచేతురు, అధిపతులను హేళనచేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటిదిబ్బ వేసి వాటిని పట్టుకొందురు.

జెఫన్యా 1:8 యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.