Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 26 వచనము 5

1దినవృత్తాంతములు 13:14 దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.

కీర్తనలు 128:1 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

ఆదికాండము 48:9 యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను.