Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 26 వచనము 17

1దినవృత్తాంతములు 9:24 గుమ్మముల కావలివారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.

2దినవృత్తాంతములు 8:14 అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును, ఉపచారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవజనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.

1దినవృత్తాంతములు 26:15 ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.

2దినవృత్తాంతములు 31:14 తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను.