Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 26 వచనము 26

1దినవృత్తాంతములు 18:11 ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదోమీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయులయొద్ద నుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.

1దినవృత్తాంతములు 22:14 ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చి యుంచితిని; నీవు ఇంకను సంపాదించుదువుగాక.

1దినవృత్తాంతములు 29:2 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

1దినవృత్తాంతములు 29:3 మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

1దినవృత్తాంతములు 29:4 గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

1దినవృత్తాంతములు 29:5 ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైన మీలో ఉన్నారా?

1దినవృత్తాంతములు 29:6 అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి

1దినవృత్తాంతములు 29:7 మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.

1దినవృత్తాంతములు 29:8 తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.

1దినవృత్తాంతములు 29:9 వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.

సంఖ్యాకాండము 31:30 మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 31:31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.

సంఖ్యాకాండము 31:32 ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది

సంఖ్యాకాండము 31:33 ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱమేకలును,

సంఖ్యాకాండము 31:34 డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,

సంఖ్యాకాండము 31:35 ముప్పది రెండువేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,

సంఖ్యాకాండము 31:36 అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పది యారువేలు.

సంఖ్యాకాండము 31:37 వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.

సంఖ్యాకాండము 31:38 ఆ గాడిదలు ముప్పదివేల ఐదువందలు,

సంఖ్యాకాండము 31:39 వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.

సంఖ్యాకాండము 31:40 మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

సంఖ్యాకాండము 31:41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను.

సంఖ్యాకాండము 31:42 సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయులకిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 31:43 మూడులక్షల ముప్పది యేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును

సంఖ్యాకాండము 31:44 ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

సంఖ్యాకాండము 31:45 పదునారువేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే

సంఖ్యాకాండము 31:46 ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను

సంఖ్యాకాండము 31:47 ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 31:48 అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి

సంఖ్యాకాండము 31:49 నీ సేవకులమైన మేము మాచేతిక్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.

సంఖ్యాకాండము 31:50 కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా

సంఖ్యాకాండము 31:51 మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారియొద్ద తీసికొనిరి.

సంఖ్యాకాండము 31:52 సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారువేల ఏడువందల ఏబది తులములు.

సంఖ్యాకాండము 3:7 వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసినదానిని, సర్వసమాజము కాపాడవలసినదానిని, వారు కాపాడవలెను.

సంఖ్యాకాండము 31:28 మరియు సేనగా బయలుదేరిన యోధులమీద యెహోవాకు పన్నుకట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగములోనుండి తీసికొని

యెహోషువ 6:19 వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.

2సమూయేలు 8:11 రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.

1రాజులు 7:51 ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్త మాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.

1రాజులు 15:15 మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను.

2రాజులు 11:9 శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదాయొద్దకు వచ్చెను.

2రాజులు 11:10 యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా

1దినవృత్తాంతములు 23:18 ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.

1దినవృత్తాంతములు 24:22 ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,

1దినవృత్తాంతములు 26:20 కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.

1దినవృత్తాంతములు 28:12 వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.

2దినవృత్తాంతములు 5:1 సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.

2దినవృత్తాంతములు 5:2 తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొనివచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.

2దినవృత్తాంతములు 15:11 తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱలను యెహోవాకు బలులుగా అర్పించి

2దినవృత్తాంతములు 31:3 మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.